మంత్రివర్గ విస్తరణ ఒక చారిత్రక తప్పిదమా!?

మంత్రివర్గ విస్తరణ ఒక చారిత్రక  తప్పిదమా!? 


-        భారత సుదర్శన్
(సామాజిక, రాజకీయ విశ్లేషకులు)
  
                  * * * * *


కేటీ రామారావును డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక తప్పిదం చేశారు. మంత్రి మండలి కూర్పులో ప్రత్యేకత ఏమీ కన్పించడం లేదు.  రాష్ట్రంలో బలమైన బీసీ సామాజిక వర్గ బలమైన నాయకుడైన ఈటెల యొక్క ఆర్థిక శాఖను హరీష్ రావుకి ఇచ్చి, వారిద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నించారు. ఇది బీసీలలో కేసీఆర్ పట్ల మరింత అసహనాన్ని, దూరాన్ని పెంచే చర్యనే అవుతుంది. హరీష్ రావు ఆ పదవిని స్వీకరించడం వల్ల 'వాళ్లు, వాళ్లు ఒక్కటే' అనే సందేశాన్ని ప్రజలకు తెలిపినట్లైంది. ఇది హరీష్ రావును ఇంకో రకంగా దెబ్బతీయడమేననే గుసగుసలు ప్రారంభమైనవి. 'ఆర్థిక శాఖ' హరీష్ రావు కు కట్టబెట్టి బీజేపీని అడ్డుకునేందుకు చేసే ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఈ విస్తరణతో కేసీఆర్ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. 


కేసీఆర్ కు బీసీలంటే పడదనే అపోహలను ఈ మంత్రివర్గ విస్తరణ మరింత పెంచే అవకాశం అవకాశాలున్నాయి. కడియం శ్రీహరికో లేదా తాటికొండ రాజయ్యకో మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఒక అతిపెద్ద సామాజిక వర్గం కూడా గుర్తింపుకు నోచుకున్నదనే విషయం ప్రాచుర్యంలోకి వచ్చేది. తెలంగాణ ఉద్యమకారుల్లో కేసీఆర్ పై ఉన్న అపరిమిత ఆగ్రహాన్ని తగ్గించేందుకు 'పెద్ది సుదర్శన్ రెడ్డి' లాంటి  యువ నేతలకో ఛాన్స్ ఇచ్చినా సానుకూలత పెరిగే అవకాశముండును. ఈ మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా బిజెపికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాలను చేజార్చుకుంటున్నది.