టీఆర్ఎస్ ప్రభుత్వం గర్వించే ఏకైక నాయకుడు 'పెద్ది సుదర్శన్ రెడ్డి'!

#ఉద్యమనాయకుడు_పెద్ది


టీఆర్ఎస్ ప్రభుత్వం గర్వించే ఏకైక నాయకుడు 'పెద్ది' సుదర్శన్ రెడ్డి! 


నాయకుడంటే ముందుండి నడిపించాలి.. 
నాయకుడంటే చెప్పేదాన్ని ఆచరించి చూపాలి..


(పీపుల్స్ ఆవాజ్ డెస్క్, హైదరాబాద్) : ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైన నిఖార్సయిన, నిజమైన ప్రజా  ప్రతినిధిగా  నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల్లో మమేకమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తూచా తప్పకుండా అమలు జరిగేలా చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. 


చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టిన ఏకైక నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డియే అంటే అతిశయోక్తి కాదు.


నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరను ధరించి, బతుకమ్మ పండుగలో స్వయంగా పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బతుకమ్మ చీరలు ఎమ్మెల్యే ల భార్యలు కట్టుకుంటారా?.. అని ప్రశ్నించినోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి. ఏ టీఆర్ఎస్ నాయకుడైనా తూతూ మంత్రంగా ప్రతిపక్షాల విమర్శలను ఖండించినవారే గానీ, ఆచరణలో చూపుతూ ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా చేయలేకపోయారు. 


ఉద్యమకాలం నుంచి నిఖార్సయిన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, కేసీఆర్ మాటను జవదాటని నేతగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇస్తే బాగుండుననే అభిప్రాయం ఇటీవల మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రజల్లో బాగా వినిపించింది. ఆచరణాత్మకంగా పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించేలా ప్రజలతో మమేకమవుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి లీడర్ల వల్ల తమకెంతో గర్వంగా ఉంటుందని టీఆర్ఎస్ విద్యార్థి, యువజన నేతలు, మహిళా నాయకులు, సీనియర్ టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.